కమ్మూరులో అన్నదానం చేసిన సర్పంచ్ సోదరులు
-పెద్దమ్మ ,మారెమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు
కూడేరు(అక్టోబర్ 22)AP 39 TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని కమ్మూరులో శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం పెద్దమ్మ, మారెమ్మ ఆలయంలో ఆయా దేవతామూర్తులకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు సర్పంచ్ చిన్న రంగారెడ్డి, ఆయన సోదరుడు పెద్ద రంగారెడ్డిలు అన్నదానం చేశారు. అనంతరం సర్పంచ్ రంగారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ప్రజలకు ,మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి ప్రజలందరికీ సుఖ శాంతులను ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు