కమ్మూరులో పోలియో నిర్మూలన పై ర్యాలీ

కమ్మూరులో పోలియో నిర్మూలన పై ర్యాలీ

 

కూడేరు,మార్చి1(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో శుక్రవారం వైద్య సిబ్బంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి పోలియో నిర్మూలనపై ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ చిన్న రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో నిర్మూలనకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. సిహెచ్ఓ జయ మాట్లాడుతూ పోలియో జబ్బు పోలియో అనే వైరస్ ద్వారా వస్తుందని తెలియజేశారు. రెండు పోలియో చుక్కలుతో పోలియో వ్యాధిని అరికట్టవచ్చు అన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సర్పంచ్ ,సిహెచ్ఓ పిల్లల పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ-2 సాయి కృష్ణ , ఏఎన్ఎం మాధవి, సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.