కమ్మూరులో ప్రారంభమైన పెద్దమ్మ జాతర వేడుకలు
కమ్మూరులో ప్రారంభమైన పెద్దమ్మ జాతర వేడుకలు
AP 39TV న్యూస్, కూడేరు:
కూడేరు మండల పరిధిలోని కమ్మూరులో గ్రామ దేవతయైన పెద్దమ్మ జాతర వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి .తొలి రోజు నవగ్రహాల పూజను వేద పండితులు చేపట్టారు. గురువారం మృత్యుంజయ హోమం ,భక్తులకు అన్నదాన కార్యక్రమం, శుక్రవారం బోనాలతో పెద్దమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఉంటుందని గ్రామ సర్పంచ్ రంగారెడ్డి , నిర్వాహకులు ,గ్రామ పెద్దలు తెలిపారు .ఈ వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పెద్దమ్మ జాతర వేడుకలను జయప్రదం చేయాలని వారు కోరారు.