కన్నవారి ఆశలపై నీళ్లు చల్లొద్దు -ఎస్ ఐ సత్యనారాయణ
కన్నవారి ఆశలపై నీళ్లు చల్లొద్దు
-ఎస్ ఐ సత్యనారాయణ
AP39TV న్యూస్ కూడేరు:
పిల్లలు ,యువకులు సరదా కోసం వంకలు ,వాగులు , బావులు, చెరువులు, చెక్ డ్యాములు వద్దకు వెళ్లి నీట మునిగి ప్రాణాలు విడిచి కన్నవారు మీపై పెట్టుకున్నా ఆశలపై నీళ్లు చల్లద్దని ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. మంగళవారం కూడేరు మండలం గొటుకూరు సమీపాన ఉన్న చెక్ డ్యామ్ వద్దకు ఈతకు వచ్చి అనంతపురానికి చెందిన వంశీ అనే యువకుడు నీట మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే .దీంతో గొటుకూరు యువకులు బుధవారం చెక్ డ్యామ్ వద్ద లోపలికి పిల్లలు యువకులు వెళ్లకుండా కంప చెట్లను అడ్డంగా వేశారు. పిల్లలు యువకులు ఈతకు వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకోవద్దని గోడలకు పెయింట్ తో రాశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ ఆ యువకులను అభినందించారు. గ్రామంలో పిల్లలకు యువకులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు .
పవన్ కుమార్,
రిపోర్టర్ కూడేరు,