కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న

కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న

తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి 

 

AP 39TV మే 1

 

మడకశిర పట్టణం బాలాజీ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు,కర్షక జీవులు తమ హక్కుల కోసం రక్తం చిందించి సాధించిన రోజు మేడే దినోత్సవం అని ఈ సందర్భంగా కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తన్నామని అన్నారు.అలాగే ఈ వైకాపా ప్రభుత్వంలో కార్మికులకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిఎన్టియుసి అధ్యక్షుడు బాలేపల్లి రాజు, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్,పట్టణ అధ్యక్షుడు మనోహర్, తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

కోంకల్లు శివన్న

AP 39 TV CHANNEL

గుడిబండ,

మడకశిర ఇంఛార్జి

సత్యసాయి జిల్లా

 

Leave A Reply

Your email address will not be published.