ఉరవకొండలో ఉచిత ఖత్నా క్యాంపుకు విశేష స్పందన
– నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పేద ముస్లిం పిల్లలు
– ఖాత్నా చేయించుకున్న పిల్లలకు పౌష్టికాహార
కిట్ల పంపిణీ
AP39TV న్యూస్, కూడేరు (ఉరవకొండ) :
ఉరవకొండలోని హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ ఖాదిరి దర్గా ఆవరణలో ఆదివారం అమీన్ మీలాదున్నబీ చారిటబుల్ సొసైటీ, జామియా తాసిరియా మరియు చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో సయ్యద్ అజ్మతుల్లా హుసేని వారి దివ్య ఆశీస్సులతో ఖత్న క్యాంపు నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఖాత్న్ క్యాంపుకు 50 మంది పేద ముస్లిం చెందిన పిల్లలు హాజరు కావడం విశేషం. ఈ క్యాంపులో వైద్యులు డాక్టర్ నిజాం, డాక్టర్ బాషా, ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించారు. ఖాత్న చేయించుకున్న పిల్లలకు సయ్యద్ అజ్మతుల్లా హుసేని, తాసిల్ బాబా, తక్కి బాబా ల చేతుల మీదుగా పౌష్టికాహార కిట్లు అందించారు. ఈ క్యాంపులో ఉచితంగా పిల్లలకు రక్త పరీక్షలు నవాజ్ ల్యాబ్స్ అధినేత రహంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లలకు ఉచితంగా మందులు ఆలీ మెడికల్స్ ,నూరాలి మెడికల్స్ నిర్వాహకులు అందించారు. అనంతరం పిల్లలకు వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ఉచిత భోజన ఏర్పాటు చేశారు.