కొర్రకోడులో టిడిపికి ఎదురు దెబ్బ
-వైఎస్సార్ సీపీలోకి 10 టీడీపీ కుటుంబాలు చేరిక
కూడేరు(అక్టోబర్ 27) AP 39 TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని కొర్రకోడులో టిడిపికి ఎదురు దెబ్బ తగిలింది. టిడిపికి చెందిన 10 కుటుంబాలు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి .వివరాల్లోకి వెళితే… టిడిపికి చెందిన మాధవయ్య , హనుమప్ప, నాగరాజు, ధనుంజయ , కుంటేన్న , అంకాలప్ప, ఓబుళపతితో పాటు మరికొందరు శుక్రవారం అనంతపురంలోని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి స్వగృహంలో పార్టీలో చేరారు. వారికి విశ్వేశ్వర్ రెడ్డి యువనేత ప్రణయ్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, కూడేరు సింగిల్ విండో ప్రెసిడెంట్ వడ్డే గంగాధర్, వైఎస్సార్ సీపీ నేతలు వెంకటరామిరెడ్డి , ధనుంజయ , ప్రభాకర్ ,చౌడప్ప ,వెంకటేష్ , ఎర్రిస్వామి, శ్రీనివాసులు , నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు