కొర్రకోడులో సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం
కొర్రకోడులో సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం
-సీఎం జగన్ కు రుణపడి ఉంటామన్న నూతన పింఛన్ లబ్ధిదారులు
కూడేరు (సెప్టెంబర్ 4)AP 39TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని కొర్రకోడులో సోమవారం నూతన పింఛన్ లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో 19 మందికి నూతనంగా పింఛన్లు మంజూరయ్యాయి. వీరంతా మాట్లాడుతూ సామాజిక భద్రత పథకం కింద పింఛన్లు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు. సీఎంకు రుణపడి ఉంటావని.. ఆయన మేలును ఎప్పటికీ మరువమని లబ్ధిదారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీటీసీ సభ్యుడు శివలాల్ రెడ్డి , పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి , వైఎస్ఆర్సిపి నేతలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు