కొర్రకోడులో 325 మందికి సర్టిఫికెట్లు అందజేత

కొర్రకోడులో 325 మందికి సర్టిఫికెట్లు అందజేత

AP 39TV న్యూస్, కూడేరు:

కూడేరు మండల పరిధిలోని కొర్రకోడులో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. జగనన్న సురక్ష సర్వేలు దరఖాస్తు చేసుకున్న 325 మందికి వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీటీసీ సభ్యుడు శివలాల్ రెడ్డి ,సింగిల్ విండో ప్రెసిడెంట్ వడ్డే గంగాధర్ , సచివాలయాల మండల కన్వీనర్ దేవేంద్ర ,తహసిల్దార్ శేషారెడ్డి ,సూపరింటెండెంట్ నాగభూషణ రెడ్డి ,చంద్రమౌళి, ఏపీఎం రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి , వీఆర్వో నాగన్న పాల్గొన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. వివిధ రకాల సర్టిఫికెట్లు పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు .కార్యాలయాలు చుట్టూ తిరగకుండానే ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఇవ్వడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.