కూడేరు,అరవకూరు, కొర్రకోడు, నాగిరెడ్డిపల్లిలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదు

కూడేరు,అరవకూరు, కొర్రకోడు, నాగిరెడ్డిపల్లిలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదు

 

-ఎస్ఐ సత్యనారాయణ

కూడేరు (సెప్టెంబర్ 1)AP 39TV న్యూస్:-

 

వినాయక చవితిని పురస్కరించుకొని కూడేరు, కొర్రకోడు , అరవకూరు పి నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో వినాయకుని విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదని ఎస్ఐ సత్యనారాయణ శుక్రవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీర్ల పండుగ సందర్భంగా ఈ గ్రామాల్లో గొడవలు చోటు చేసుకున్నాయి.శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యల్లో భాగంగా ఈ గ్రామాలకు అనుమతిని నిరాకరించడం జరిగిందని ఆయన తెలిపారు .మండలంలో మిగిలిన గ్రామాల వారు విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. లేదంటే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయంపై గ్రామాల్లో దండోరా వేయించామని ఆయన తెలిపారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.