కూడేరులో ఘనంగా గద్దర్ కు ఘన నివాళి
కూడేరులో ఘనంగా గద్దర్ కు ఘన నివాళి
కూడేరు (సెప్టెంబర్ 6)AP 39TV న్యూస్:-
ప్రజా గాయకుడు గద్దర్ కు కూడేరు మండల ప్రజా కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ప్రజా కళాకారులు మాట్లాడుతూ ఆయన పాటలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని ..ఆయన ఒక విప్లవ కవి అని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజా గాయకుడు ఆదినారాయణ, ఎస్సీ ఎస్టీ జేఏసీ నేత సాకే హరి, మహా బోధి కృష్ణమూర్తి , మన్నల లక్ష్మన్న ,ప్రజా కళాకారులు నిషార్ అమర్, ఈశ్వరయ్య ,ఎర్రి స్వామి , జయపురం సంజీవ రాయుడు , వన్నూరప్ప, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు