కూడేరులో ఆవు దూడను చంపిన చిరుత
కూడేరులో ఆవు దూడను చంపిన చిరుత
-భయాందోళన చెందుతున్న రైతులు
కూడేరు(సెప్టెంబర్ 16 )AP 39 TV న్యూస్:-
కూడేరుకు చెందిన రైతు ఎరువుల అంగడి సంగప్ప పొలములో కట్టేసిన ఆవు దూడపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసి చంపేసింది. శనివారం ఆ రైతు పొలంలోకి వెళ్లి చూడగా ఆవు దూడ కనిపించలేదు. దూరంలో మృతి చెంది ఉండడాన్ని గుర్తించాడు.ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బీట్ ఆఫీసర్ నీలవేణి , వెటర్నరీ అధికారులు రాఘవ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు .అక్కడ పడిన అడుగులు ఆవు దూడ గొంతు కింద గాయాన్ని బట్టి చిరుత పులి చంపివేసి ఉంటుందని ఫారెస్ట్ అధికారి నిర్ధారించారు. చిరుత సంచారం తెలుసుకున్న రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు . అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత భారీ నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు