కూడేరు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గా బైరెడ్డి రామచంద్రారెడ్డి
కూడేరు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గా బైరెడ్డి రామచంద్రారెడ్డి
కూడేరు(సెప్టెంబర్ 16)AP 39TV న్యూస్:-
కూడేరు మండల వైఎస్సార్ సిపి కన్వీనర్ గా జల్లిపల్లికి చెందిన బైరెడ్డి రామచంద్రా రెడ్డి నియమితులయ్యారు. శనివారం ఈ విషయాన్ని ఆయన విలేకరులకు తెలిపారు. తన ఎంపికకు కృషి చేసిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై .విశ్వేశ్వర్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మండల కన్వీనర్ గా ఎంపిక చేసినందుకు శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు .పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ,నేతలు అందరూ సహకారం అందించాలని ఆయన కోరారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.