రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న కూడేరు టీడీపీ నేతలు
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న కూడేరు టీడీపీ నేతలు
కూడేరు (సెప్టెంబర్ 19)AP 39 TV న్యూస్:-
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది .మంగళవారం ఏడవ రోజుకు చేరుకుంది .ఈ రిలే నిరాహార దీక్షలో కూడేరు కు చెందిన టిడిపి నేతలు పుట్ట నరేష్ , చంద్రబాబు నాయుడు , ముని ,దేవరాజ్ ,హరి , మనోహర్ ,ఎర్రి స్వామి , కుల్లాయి స్వామి ,రవి ,అశోక్ తదితరులు పాల్గొన్నారు. అర్థనగ్నంగా నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడు ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.