కూడేరులో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
కూడేరులో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
-ప్రథమ బహుమతి సాధించిన నవధాన్యాలతో వేసిన వినాయక ముగ్గు
కూడేరు(సెప్టెంబర్ 20)AP 39 TV న్యూస్:-
కూడేరులో కలగళ్ళ రోడ్డు క్రాస్ వద్ద ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం మహిళకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. శారద అనే మహిళల నవధాన్యాలతో వేసిన ముగ్గు విశేషంగా నిలిచి ప్రతిమ బహుమతి సాధించింది. ద్వితీయ విజేతగా లక్ష్మి, తృతీయ విజేతగా తులసి, నాలుగో విజేతగా శివలక్ష్మి , ఐదవ విజేతగా ఆకాంక్ష నిలిచారు .వీరందరికీ నిర్వహకులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు బుర్ర ఎర్రిస్వామి, బాల సుబ్రహ్మణ్యం , శివ ,లక్ష్మీపతి, రామాంజనేయులు ,రాజు , మణికంఠ ,గోవింద్ , ఎర్రి స్వామి , రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు