కూడేరులో చురుగ్గా సాగుతున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష ‘ సర్వే
కూడేరులో చురుగ్గా సాగుతున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష ‘ సర్వే
-ప్రజకు అందుబాటులో ఉండాలంటున్న వైద్య సిబ్బంది
కూడేరు(సెప్టెంబర్ 25)AP39 TV న్యూస్:-
ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమం కూడేరులో చురుగ్గా సాగుతోంది .సోమవారం MLHP కరిష్మా ,ANM సుశీల రెండు బృందాలుగా విడిపోయి ఇంటింటా సర్వే చేపట్టారు . ప్రతి కుటుంబంలో వైద్య పరీక్షలు నిర్వహించి యాప్లో నమోదు చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 10న సచివాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు .కార్యక్రమంలో ఆశా వర్కర్లు మాధవి తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు