కూడేరులో వాడి వేడిగా మండల సర్వ సభ్య సమావేశం

కూడేరులో వాడి వేడిగా మండల సర్వ సభ్య సమావేశం

-సమస్యలపై అధికారులను ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులు

కూడేరు(అక్టోబర్11)AP 39 TV న్యూస్:-

కూడేరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వ సత్య సమావేశం వాడి వేడిగా సాగింది .సమస్యలపై పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు.. తాను విజిట్ చేసినప్పుడు మీరు అందుబాటులో లేరు .పిల్లలకు నాణ్యతగా భోజనం పెట్టడం లేదని ఫిర్యాదులు వచ్చాయని జడ్పిటిసి సభ్యురాలు తుప్పటి అశ్విని బాయ్స్ హాస్టల్ వార్డెన్ గురు ప్రసాద్ ను ప్రశ్నించారు. కూడేరు ,కరుట్లపల్లి పాఠశాలల్లో కూడా భోజనం నాణ్యతగా లేదని పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, మీరు పర్యవేక్షణ చేయకపోతే ఎలా అని జడ్పిటిసి సభ్యురాలు ,సర్పంచ్ ఓబులమ్మ మండల విద్యాధికారి చంద్రశేఖర్ను ప్రశ్నించారు. మీ శాఖల సిబ్బంది ఫోన్ చేస్తే స్పందించడం లేదని పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ట్రాన్స్ కో ఏఈ గొస్ , ఏఓ విజయ్ కుమార్ ను వారు ప్రశ్నించారు. ఇంకా పలు శాఖలకు సంబంధించి సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. సమావేశంలో ఎంపీడీవో ఎంకే భాష తహసీల్దార్ శేషారెడ్డి ,వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ, దేవా, కో ఆప్షన్ సభ్యుడు సర్దార్ వలి, సర్పంచులు ,ఎంపీటీసీ సభ్యులు, ఏపీఎం రాజశేఖర్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులు, వెటర్నరీ డాక్టర్ శ్వేత, ఈ ఓ ఆర్ డి లక్ష్మి నరసమ్మ, హౌసింగ్ ఏఈ శేఖర్ తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.