కూడేరులో విద్యుత్ ఉపకేంద్రం వద్ద సిపిఐ నేతలు ధర్నా

కూడేరులో విద్యుత్ ఉపకేంద్రం వద్ద సిపిఐ నేతలు ధర్నా

 

AP 39TVన్యూస్ ,కూడేరు:

కూడేరులోని విద్యుత్ కేంద్రం ముందు శుక్రవారం సీపీఐ నేతలు ధర్నా చేపట్టారు .ఈ సందర్భంగా సిపిఐ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.గోపాల్ మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు మంగళం పాడి వ్యవసాయ పంటలకు మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం దారుణం అన్నారు . ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ప్రభుత్వము చెబుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు. ఆమోదించి కరెంటు చార్జీలు విపరీతంగా పెంచడానికి పూనుకుందన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ట్రాన్స్ కో అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నారాయణమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు రమణ. నాయకులు కమ్మూరు కాసిం. ప్రసాద్. కాసిం పీరా తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.