కూడేరులో ఘనంగా అంబేద్కర్ కు నివాళులు

కూడేరులో ఘనంగా అంబేద్కర్ కు నివాళులు

 

కూడేరు (AP 39 TV న్యూస్):-

 

కూడేరులో బుధవారం ఎంపీడీవో నాగభూషణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన సామాజిక సమతా సంకల్పం చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అందరం అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు. 19న విజయవాడలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది .ఈ కార్యక్రమానికి దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో తులసి ప్రసాద్ ,పంచాయతీ కార్యదర్శి రఘు ,వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్ర రెడ్డి , సింగల్ విండో ప్రెసిడెంట్ గంగాధర్ ,జేఏసీ మండల కన్వీనర్ దేవేంద్ర ,ఎంపీటీసీ సభ్యుడు రమేష్ ,దళిత సంఘ నేతలు కమ్మూరు సంగప్ప , మరుట్ల ఎర్రిస్వామి ,,నాగార్జున దేవరాజ్ ,అంబేద్కర్ ,సంజీవ రాయుడు తో పాటు పలువురు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.