కూడేరులో పోలీసుల కవాతు

కూడేరులో పోలీసుల కవాతు

 

కూడేరు,మార్చి11(AP 39 TV న్యూస్):-

కూడేరులో సోమవారం సాయంత్రం సిఐ శివరాముడు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం నుంచి అనంతపురం ..బళ్లారి ప్రధాన రహదారిపై కలగల్ల రోడ్డు క్రాస్ వరకు చేపట్టారు. అక్కడి నుంచి గ్రామ పురవీధుల్లో కవాతు చేపట్టి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు .ఈ సందర్భంగా సిఐ శివరాముడు మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి . గ్రామాల్లో ఎవరు గొడవలకు దిగకుండా ఉండాలని హెచ్చరించారు. కావాలని అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు .కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.