కూడేరులో బదిలీయైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం
కూడేరులో బదిలీయైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం
AP 39TV న్యూస్, కూడేరు:
కూడేరు హైస్కూల్లో పని చేస్తూ ఇటీవల బదిలీయైన ఉపాధ్యాయులు సునీత , గాయత్రీ ,మంజుల ,రఘు , హరికృష్ణ ,సుజాతలకు గురువారం విద్యార్థులు , ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు తొలత వారు పాఠశాలలోకి రాగానే డప్పుల నడుమ వారిపై పూలను చల్లుతూ విద్యార్థులు స్వాగతం పలికారు. తర్వాత ఉపాధ్యాయులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు .వారు పిల్లల విద్యాభివృద్ధికి చేసిన కృషి గురించి కొనియాడా రు. అనంతరం డప్పుల నడమ వారిని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేస్తూ వీడ్కోలు పలికారు .కార్యక్రమంలో హెచ్ ఎం శ్రీదేవి ,పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఓబుళపతి , ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు