కూడేరులో ఘనంగా ముగిసిన చిన్న పీర్ల పండగ వేడుకలు

కూడేరులో ఘనంగా ముగిసిన చిన్న పీర్ల పండగ వేడుకలు

 

-చిందులు తొక్కిన పిల్లలు పెద్దలు

 

కూడేరు(ఆగస్టు 13)AP 39TV న్యూస్:-

కూడేరు ఆదివారం చిన్న పీర్ల పండగ వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు జలది కార్యక్రమాన్ని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పీర్ల దేవుళ్ళు తొలత గుండం చుట్టూ ప్రదక్షిణలు చేపట్టాయి. ముజుబార్ నిషార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా డప్పుల నడుమ పిల్లలు ,పెద్దలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా చిందులు తొక్కారు. పీర్ల దేవుళ్ళను వీక్షించడానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. చక్కెర, బెల్లంతో పీర్లకు చదివింపులు చేయించారు.ఈ సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.