కూడేరు ఆసుపత్రిలో హెచ్ డి ఎస్ సమావేశం
కూడేరు ఆసుపత్రిలో హెచ్ డి ఎస్ సమావేశం
కూడేరు (ఆగస్టు 30)AP 39TV న్యూస్:-
కూడేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశానికి కమిటీ అధ్యక్షుడు ఎంపీపీ నారాయణరెడ్డి హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి నిధులతో రోగులకు సిబ్బందికి అవసరమయ్యే మౌలిక వసతులకు ఖర్చు పెట్టాలని సూచించారు. పైప్లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని డాక్టర్ సరిత కు ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ మండల విద్యాధికారి సరిత సిహెచ్ఓ వరలక్ష్మి సూపర్వైజర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు