కూడేరు సొసైటీ బ్యాంక్ బలోపేతానికి కృషి చేయండి
కూడేరు సొసైటీ బ్యాంక్ బలోపేతానికి కృషి చేయండి
-సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు కొర్రకోడు వడ్డే గంగాధర్
కూడేరు(ఆగస్టు 30)AP 39TV న్యూస్,:-
కూడేరు సొసైటీ బ్యాంక్ బలోపేతానికి కృషి చేయాలని ఆ బ్యాంక్ అధ్యక్షుడు కొర్రకోడు వడ్డే గంగాధర్ బుధవారం ఎడిసిసి బ్యాంక్ సీఈవో రాంప్రసాద్ ను కలిసి కోరారు. సొసైటీ బ్యాంక్ తరఫున కూడేరుకు మంజూరైన పెట్రోల్ బంక్ తొందరగా ఏర్పాటు చేసి బ్యాంక్ కు ఆదాయం వచ్చేలా చూడాలని విన్నవించుకున్నారు. కౌలు రైతులకు, రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని కోరారు. బ్యాంక్ అభివృద్ధికి తమ వంతు కృషి అందిస్తామని సీఈవో హామీ ఇచ్చారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడెరు