కూడేరులో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

కూడేరులో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

-రాఖీలు కట్టిన ఈశ్వరి విశ్వవిద్యాలయం సంచాలకురాలు వేదావతి

కూడేరు(ఆగస్టు 31)AP 39TV న్యూస్:-

కూడేరులోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈశ్వరి విశ్వవిద్యాలయం సంచాలకురాలు వేదావతి స్టేట్ బ్యాంక్ , గ్రామీణ బ్యాంక్, ఎంపీడీవో కార్యాలయం , తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లి అందరికీ రాఖీలు కట్టారు. అన్నా చెల్లెలు.. అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రక్షాబంధన్ అని ఆమె తెలియజేశారు. రాఖి అనేది రక్షణ బంధం అని తెలిపారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.