కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని సీఎంకు ఎంపీపీ వినతి

కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని సీఎంకు ఎంపీపీ వినతి

 

AP 39TV న్యూస్ ,కూడేరు:

కూడేరులో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేయాలని ఎంపీపీ నారాయణరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్నారు. బుధవారం నార్పలలో జరిగిన “జగనన్న వసతి దీవెన” కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని ఎంపీపీ కలిశారు. మండలంలో 28 గ్రామాలు ఉన్నాయని ,ఆయా గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలకు సుమారు 800 మంది దాకా విద్యార్థిని విద్యార్థులు వెళుతున్నారని వివరించారు .గ్రామాల నుంచి మండల కేంద్రం కూడేరుకు వచ్చి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రం కూడేరులోనే జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా మండలంలోని పలు సమస్యలను ,మండల అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను సీఎం దృష్టికి ఎంపీపీ తీసుకెళ్లారు. స్పందించిన సీఎం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీపీ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.