కూడేరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు
కూడేరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు
-మంగళవారం ముగ్గుల పోటీలు
కూడేరు(సెప్టెంబర్ 18)AP 39 TV న్యూస్:-
కూడేరులో కలగల్ల రోడ్డు క్రాస్ వద్ద ఫ్రెండ్స్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా వినాయక చవితి ఉత్సవ వేడుకలను జరుపుకున్నారు. ముక్కోటి దేవతలకు విజయాలను అందించే బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం సింహం మీద కూర్చొని ఉన్నట్టు ఉండడంతో అందర్నీ ఆకట్టుకుంది. మంగళవారం సాయంత్రం ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు .మండపం ముందు వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు బుర్ర సుబ్రహ్మణ్యం ,గొల్ల రామాంజనేయులు ,వాటర్ ప్లాంట్ శివ ,శ్రీదర్ గౌడ్ ,లక్ష్మీపతి ,రాజు ఎర్రిస్వామి ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు