కుష్టు వ్యాధిపై అవగాహన
కూడేరు(AP 39 TV న్యూస్):-
కూడేరు మండల పరిధిలోని రామచంద్రాపురం , గొటుకూరు గ్రామంలోని పాఠశాలల్లో గురువారం వైద్యాధికారులు కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు .ఈ సందర్భంగా MLHP చంద్రకళ మాట్లాడుతూ శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉండడం కుష్టు వ్యాధి లక్షణం అన్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు .ఈ వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదన్నారు. మందుల వాడితే ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం భాను, ఆశ వర్కర్ పెద్దక్క, స్వయం సహాయక సంఘ సభ్యురాళ్లు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు