వెయిట్ లిఫ్టింగ్ లో కూడేరు విద్యార్థుల ప్రతిభ
వెయిట్ లిఫ్టింగ్ లో కూడేరు విద్యార్థుల ప్రతిభ
-రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన హేమంత్
కూడేరు (అక్టోబర్ 13)AP 39 TV న్యూస్:
వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో కూడేరు హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివరాల్లోకి వెళితే…. అనంతపురంలోని అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్ -17 స్కూల్ గేమ్స్ జరిగాయి. అందులో వెయిట్ లిఫ్టింగ్ లో కూడేరు హైస్కూల్ కు చెందిన పదవ తరగతి విద్యార్థి హేమంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. మరో విద్యార్థి వాసు కూడా ప్రతిభ కనబరిచి మెడల్ సాధించాడు. శుక్రవారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హెచ్ఎం శ్రీదేవి , పిడి అక్కులప్ప, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అభినందించారు. మున్ముందు మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు