తీరనున్న లో-ఓల్టేజి సమస్య

విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరుతో తీరనున్న లో-ఓల్టేజి సమస్య

-డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు జయచంద్రానాయుడు

 

కూడేరు(అక్టోబర్ 13)AP 39 TV న్యూస్:-

కూడేరు మండల పరిధిలోని చోళసముద్రం -కొర్రకోడు గ్రామాల మధ్య నూతనంగా మంజూరైన 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరుతో లో- ఓల్టేజ్ సమస్య తీరుతుందని డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు సోమర జయచంద్ర నాయుడు పేర్కొన్నారు .శుక్రవారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఈప్రాంత రైతులు లో -ఓల్టేజీ సమస్యతో ఇబ్బంది పడేవారన్నారు .ఈ విషయాన్ని జిల్లా ఎమ్మెల్సీ కొనకొండ్ల శివరాంరెడ్డి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆయన తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారన్నారు. దీంతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగిందన్నారు .సీఎం జగన్ రైతు పక్షపాతి కావడంతో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే సబ్ స్టేషన్ మంజూరుకు చర్యలు చేపట్టడం రైతులకు వరం అన్నారు. సబ్ స్టేషన్ మంజూరుకు కృషి చేసినందుకు ఎమ్మెల్సీకి మంత్రికి ,సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు శైలాద్రి యాదవ్ ,శివరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.