జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

*జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం*

AP 39 TV కొడిమి అనంతపురము:

*కొడిమి జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మచ్చా రామలింగారెడ్డి*

 

*సీ.ఎం వైఎస్ జగన్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ ఎం.గౌతమికి ధన్యవాదాలు*

 

*రాష్ట్రానికి కొడిమి జర్నలిస్ట్ కాలనీ రోల్ మోడల్ చేస్తాం*

 

*మచ్చా రామలింగారెడ్డి* *రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, APWJU*

 

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా వారి కుటుంబాల్లో వెలుగు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుందని జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్నారు

 

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని కొడిమి గ్రామం నందుగల జర్నలిస్టు కాలనీలో డ్రైనేజీ, సిమెంట్ రోడ్డు పనులకు శుక్రవారం ఉదయం మచ్చా రామలింగారెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ మండలం ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి విజయరాజు, సాక్షి నగేష్ జానీ, హరి, నాయక్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ కొడిమీ జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృషిచేసిన స్థానిక శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కలెక్టర్ గౌతమికి జర్నలిస్టు కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చొరవ, కృషి వలన నిధులు విడుదలయ్యాయని అన్నారు

 

రాష్ట్రంలోని మొట్టమొదటి జర్నలిస్టు కాలనీ కొడిమి జర్నలిస్ట్ కాలనీ రాబోవు రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు

 

జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని కలసికట్టుగా ఉండటం ద్వారానే జర్నలిస్టులకు సంక్షేమ ఫలాలు అందుతాయని అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని రాబోవు రోజుల్లో అనంతపురం జిల్లా రోల్ మోడల్ గా ఉండేందుకు జర్నలిస్టులు అందర్నీ ఒక వేదిక మీదికి తీసుకొస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు

 

అనంతపురం రూరల్ మండలం ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు కాలనీ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఈ కాలనీకు అన్ని విధాల అభివృద్ధి చేయాలని తమకు సూచించారని అందుకు తాము ఎప్పుడూ సహకారం అందిస్తామని కృష్ణారెడ్డి జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ప్రసాద్, అక్కులప్ప, రమణ, హరి కృష్ణ, శ్రీ రాములు, వేణు, చక్రి, ప్రకాష్ ఇతర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు

 

Sudheer

AP 39 TV

Anantapur 

Leave A Reply

Your email address will not be published.