మహిళపై దాడులను అరికట్టేందుకు మహిళలంతా ఏకమై పోరాడుదాం
మహిళపై దాడులను అరికట్టేందుకు మహిళలంతా ఏకమై పోరాడుదాం
-ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి
కూడేరు(ఆగస్టు3)AP 39TV న్యూస్:
మహిళలపై జరుగుతున్న హింసలు ,దాడులను అరికట్టేందుకు మహిళలంతా ఏకమై కలిసికట్టుగా పోరాడుదామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు. మహిళలపై హింసలు అరికట్టేందుకు పోరుబాట పేరుతో ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర గురువారం కూడేరు కు చేరింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై హింసలు ,దాడులు దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు .కానీ వాటిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న దాడులు హింసలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుకు చట్టం చేయాలన్నారు. స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. చేయి చేయి కలుపుదాం మహిళలపై హింస దాడులు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దామని మహిళలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, జిల్లా అధ్యక్షురాలు శ్యామల కోశాధికారి రమాదేవి జిల్లా నాయకురాలు నాగలక్ష్మి , రామాంజనమ్మ, సిపిఎం నాయకులు కృష్ణమూర్తి వీరప్ప రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు