మనబడి నాడు- నేడు పనులపై సమీక్ష
మనబడి నాడు- నేడు పనులపై సమీక్ష
కూడేరు (అక్టోబర్ 10)AP39 TV న్యూస్ :-
కూడేరులోని ఎమ్మార్పీ సెంటర్ లో మంగళవారం మన బడి నాడు – నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. మండల విద్యాధికారులు చంద్రశేఖర్, సాయి కృష్ణ , పీఆర్ ఏఈ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు . పనులు సకాలంలో పూర్తి చేయాలి. మిగిలి ఉన్న నిధులకు సంబంధించి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రతి పనికి సంభందించిన వివరాలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ప్రతి వారం ఫోటోలను యాప్ నందు అప్లోడ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సిఆర్పిలు వెంకటరమణ ఆదిలక్ష్మి ,శివ ,ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు