మందులు పిచికారి చేసే డ్రోన్లకై దరఖాస్తు చేసుకోండి ఏఓ నవత
మందులు పిచికారి చేసే డ్రోన్లకై దరఖాస్తు చేసుకోండి
ఏఓ నవత
AP39 TV న్యూస్ ,కూడేరు:
ప్రభుత్వము పంటలకు మందులు పిచికారి చేసే డ్రోన్లను 40 శాతం సబ్సిడీతో మంజూరు చేస్తుందని మండల వ్యవసాయ అధికారి నవత బుధవారం తెలిపారు. మండలానికి మూడు డ్రోన్లు మంజూరైనట్టు ఆమె చెప్పారు. ఐదు మంది(ఎస్సీ, ఎస్టీ,బిసి, ఓసి) సభ్యులు గ్రూప్ గా తయారై డ్రోన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు మీ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. డ్రోన్ ఆపరేట్ చేయడానికి గ్రూపులోని సభ్యులకు ఒక్కొక్కరికి విడుతల వారిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు..