మరుట్లలో జగనన్న ఆరోగ్య సురక్షకు విశేష స్పందన
మరుట్లలో జగనన్న ఆరోగ్య సురక్షకు విశేష స్పందన
-వైద్య కోసం క్యూ కట్టిన జనం
కూడేరు(అక్టోబర్ 12)AP 39 TV న్యూస్:-
కూడేరు మండలం మరుట్ల- రెండవ కాలనీలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది కార్యక్రమానికి సర్పంచ్ లావణ్య ,కలగల్ల సర్పంచ్ సువర్ణమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు .ప్రజల ముంగిటకే మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఆలోచన ఇంతవరకు ఏ సీఎం చేయలేదన్నారు . ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమం పేద ప్రజలకు ఓ వరం అన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యం కోసం జనం క్యూ కట్టారు. సుమారు 300 మంది దాకా వైద్య సేవలు పొందారు. అవసరమైన వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ చౌదరి , డిప్యూటీ తహసిల్దార్ విశ్వనాథ్ , వైద్యులు సరిత , లక్ష్మీనారాయణ ,సూపర్వైజర్ రవీంద్ర ,ల్యాబ్ టెక్నీషియన్ వేణుగోపాల్, MLHP లు,ANM లు, పంచాయతీ కార్యదర్శి బాషా, సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు వైద్య సిబ్బంది , మరుట్ల మూడు కాలనీలకు, కలగళ్ళకు చెందిన వైయస్సార్ సిపి నేతలు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు