సీఎం జగన్ మత్స్యకారుల పక్షపాతి

 సీఎం జగన్ మత్స్యకారుల పక్షపాతి 

-బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ

 

AP39TV న్యూస్ , కూడేరు:

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల పక్షపాతి అని బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ పేర్కొన్నారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మత్స్య సహకార సంఘాల లీజు మూడు సంవత్సరములు పొడిగిస్తున్నట్లు జీవో ఎంఎస్ నెంబర్ 99 జారీ చేసి మరొక్కసారి జగన్ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలిచిందన్నారు. 217 జీవో మత్స్య సహకా మత్స్యకారులను నాశనం చేస్తుందని, నానా యాగీ చేసిన వారి నోర్లను ఒక్కసారిగా మూయించడం హర్షించదగ్గ విషయమన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు కి మత్స్యకారులు తమ సమస్యలను అర్జీ రూపంలో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తోలుతీస్తా, తొక్క తీస్తానన్న మాటలు మత్స్యకారులు మరువలేదన్నారు.. అలాంటి వారే ఈరోజు మత్స్యకారులపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ 217 జీవోపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కోర్టులకు వెళ్లారు. మత్స్యకారుల ముసుగులో ఉన్న కొంతమంది పెత్తందారులను కాపాడేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైఏస్సార్ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక విప్లవంలో భాగంగా, మత్స్యకారులకు మూడు ఎమ్మెల్సీ, మూడు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఒక మత్స్యకారుని రాజ్యసభకు పంపించి సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. మత్స్య శాఖా మాత్యులు సీదిరి అప్పలరాజు కృషితోనే 99 జీవో వచ్చిందన్నారు. ఈనెల 1వ తేదీ జీవో నెంబర్ 776 ను తీసుకొచ్చి 1432-34 ఫసలికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ట్యాంకులకు మూడు సంవత్సరముల లీజు పొడిగించడంతో మైదాన ప్రాంత మత్స్యకారులకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. ఈ వెసులుబాటు 217 జీవోకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన చెరువులకు వర్తించనందున నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతాలలో మత్స్యకారులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. 217 జీవో కేవలం పైలెట్ ప్రాజెక్టు మాత్రమేనని చెప్పినా వినకుండా కోర్టులకు వెళ్లడంతో 99 జీవో వర్తించనందువల్ల, ఆ ప్రాంతం మత్స్య సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. దీనికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.