నూతన సీఐని కలిసిన ఎంపీపీ, YSR CP నేతలు
నూతన సీఐని కలిసిన ఎంపీపీ, YSR CP నేతలు
కూడేరు(అక్టోబర్ 20)AP 39TVన్యూస్:-
ఉరవకొండ రూరల్ సిఐగా ప్రవీణ్ కుమార్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు .ఆయన శుక్రవారం కూడేరు పోలీస్ స్టేషన్ సందర్శించారు .ఈ సందర్భంగా ఎంపీపీ నారాయణరెడ్డి , మండల వైయస్సార్ సిపి నేతలు ,సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ ,వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ,జెసిఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర, సింగల్ విండో ప్రెసిడెంట్ గంగాధర్, నాయకులు హనుమంత్ రెడ్డి ,రామ్మోహన్, నరేష్ ,వన్నూరప్ప ,ఎర్ర నాగప్ప , రామాంజనేయులు , లక్ష్మన్న , చోళసముద్రం గంగాధర్ ,నీలకంఠ రెడ్డి , పరమేశ్వర్ రెడ్డి ,శ్రీనివాసులు, ఎర్రిస్వామి తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు