కల్తీలేని అమ్మ డెయిరీ పాలను కొనుగోలు చేయండి

కల్తీలేని ‘అమ్మ డెయిరీ’ పాలను కొనుగోలు చేయండి

పది వేలమంది అమ్మల ఆధ్వర్యంలో నడిచే ‘అమ్మ సహకార డెయిరీ’ పాలనే ప్రతి కుటుంబం కొనుగోలు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి కాలనీ, పాపంపేట సచివాలయాల పరిధిలోని డ్వాక్రా సంఘాల లీడర్లతో మరియు మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళా సాధికారితే లక్ష్యంగా అమ్మ డెయిరీని ఏర్పాటు చేశాం. ఈ డెయిరీ నుంచి జూలై 1 నుంచి పాలను సేకరిస్తారు. విస్త్రత ప్రచారం చేయండి. రూపాయి తక్కువ ధరకే నాణ్యమైన పాలను ఇంటికే చేర్చుతారు. గతంలో పాడి రైతులకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించేది కాదు. 2019కి ముందు మూడుశాతం వెన్నకల్గిన ఆవుపాలు లీటరు 20 రూపాయలతో పాడి రైతుల వద్ద కొనుగోలు చేస్తూ బయట మార్కెట్‌ 40–45 రూపాయలకు విక్రయించేవారు. మహిళల కష్టాన్ని ప్రైవేటై డెయిరీల నిర్వాహకులు రూపాయలుగా మార్చుకునేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత అమూల్‌ను తీసుకురావడంతో అక్రమ పాల వ్యాపారినికి అడ్డుకట్ట పడింది. పాడి రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర కల్పిస్తూ వచ్చారు.

10 వేలమంది మహిళా పాడి రైతులను సమీకరించి వారందరికీ సభ్యత్వం కల్పించి ఆలమూరు సమీపంలో 5 ఎకరాల స్థలంలో దాతలు సహకారం, మా సొంత నిధులు 20 కోట్ల రూపాయలతో డెయిరీ నిర్మించాం. ఈ డెయిరీనికి ఆ మహిళలకు ఉచితంగా ఇచ్చేశాం. మహిళా రైతులకు మంచి జరుగుతూ… మరోవైపు నాణ్యమైన పాలను ప్రజలకు అందివ్వడమే ఈ డెయిరీ లక్ష్యం. మంచిపేరు తెచ్చుకుంటేనే పదికాలాల పాటు ఉంటుందని సభ్యులకు చెప్పాం. కల్తీలేని పాలను అందించడమే అమ్మ డెయిరీ లక్ష్యం. మిగిలిన డెయిరీలకంటే రూపాయి తక్కువ ధరకే నాణ్యమైన పాలను డోర్‌ డెలవరీ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. 

లాభం అంతా కూడా ప్రతి మూడు నెలలకోసారి సభ్యులు పంచుకుంటారు. ములకనూరు డెయిరీని స్ఫూర్తిగా తీసుకుని అమ్మ డెయిరీని ఏర్పాటు చేశాం. 25 వేలమంది పాడి రైతుల సభ్యులుగా ఉన్న ములకనూరు సహకార డెయిరీ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. అమ్మ సహకార డెయిరీ కూడా కల్తీలేని పాలను అమ్ముతుంది. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.