కడదరకుంటలో ఘనంగా ముగిసిన మొహరం వేడుకలు
కడదరకుంటలో ఘనంగా ముగిసిన మొహరం వేడుకలు
కూడేరు,AP 39TV న్యూస్ (జూలై 30):
కూడేరు మండలం కడదరకుంటలో మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి .వేడుకల్లో భాగంగా ఆదివారం పీర్ల జలది కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు .చిన్న లాల్ పెద్దలాల్ పీర్ల స్వాములను గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేశారు .పీర్ల దేవుళ్లను వీక్షించడానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తిశ్రద్ధలతో పీర్లను ప్రజలు దర్శించుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు .
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు