ఎంపీడీఓ ముస్తఫా కమల్ బాషాకి ఘనంగా సన్మానం
కూడేరు ,మే 31 (AP 39 TV న్యూస్)
పదవీ విరమణ పొందిన ఎంపీడీఓ ముస్తఫా కమల్ బాషాకి శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నారాయణరెడ్డి అధ్యక్షతన ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ నారాయణ రెడ్డి, పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, అధికారులు మాట్లాడుతూ ఎంపీడీవో మండలానికి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు.. ఎక్కడైనా సమస్య తలెత్తితే సామరస్యంగా చర్చించి పరిష్కార మార్గం చూపే వారని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని దేవున్ని ప్రార్థించారు. అనంతరం ఆయనకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మండల కో ఆప్షన్స్ సభ్యుడు సర్దార్ వలి,ముస్లింలు కూడా ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగభూషణ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీలు దేవా, సుబ్బమ్మ, ఈఓఆర్డి లక్ష్మీనరసమ్మ , ఎంఈఓ చంద్రశేఖర్ ఏపీవో తులసి ప్రసాద్ ఏపీఎం రాజశేఖర్ హౌసింగ్ ఏఈ శేఖర్, పంచాయతీ కార్యదర్శులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.