కూడేరులో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కూడేరులో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

AP 39TV ,న్యూస్ కూడేరు:

ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం కూడేరులో ఎమ్మార్పీఎస్ ,విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కలగళ్ల రోడ్డు వద్ద ఉన్న జెండా కట్ట వద్ద నాయకులు జండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కృష్ణ మాదిగ పుట్టినరోజును పురస్కరించుకొని దివ్యాంగ బాలబాలికల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు .ఈ సందర్భంగా వీహెచ్ పి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న , ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అధినేత కృష్ణ మాదిగ పోరాట ఫలితంగా మాదిగలకు ,ఉప కులాలకు ఆత్మగౌరవం దక్కిందన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సిద్ధప్ప ,నాయకులు మారన్న, విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు శ్రీరాములు , మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.