ముద్దలాపురంలో పర్యటించిన జాయింట్ కలెక్టర్

ముద్దలాపురంలో పర్యటించిన జాయింట్ కలెక్టర్

 

 

కూడేరు,AP 39 TV న్యూస్:-

కూడేరు మండల పరిధిలోని ముద్దలాపురంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పర్యటించారు. ఆర్డిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీ వద్ద రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన ,హార్టికల్చర్ సమగ్ర అభివృద్ధి మిషన్ ద్వారా సబ్సిడీతో పది టన్నుల నిల్వ సామర్థ్యం గల రెండు సోలార్ కోల్డ్ స్టోరేజ్ లను ఒక్కొక్కటి రూ.12.5 లక్షల వ్యయంతో నిర్మించారు. వాటిని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు .తర్వాత రైతు నేస్తం కంపెనీలో తయారవుతున్న స్నాక్స్ ,ఆహార ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించారు. వాటి మార్కెటింగ్ సదుపాయం పై ఆరా తీశారు. ఇక్కడ తయారయ్యే ఆహార ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి హరినాథ్ రెడ్డి,. రైతు నేస్తం కంపెనీ సీఓఓ మురళీకృష్ణ, ఆర్డిటి అధికారులు రిజ్వానా బేగం, శంకర్ నాయక్ ,నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.