పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
-జాగృతి స్కూల్ కరస్పాండెంట్లు శిరీష, పురుషోత్తం
AP 39 TV,న్యూస్ కూడేరు:
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కూడేరులోని జాగృతి స్కూల్ కరస్పాండెంట్లు శిరీష, పురుషోత్తములు పేర్కొన్నారు .శనివారం ఆ స్కూల్ ఆధ్వర్యంలో కూడేరులో ప్రసిద్ధిగాంచిన జోడి లింగాల సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్న గోశాల పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణం కలుషితమైపోతుందన్నారు. ఇలాంటి తరుణంలో మొక్కలు నాటి వాటిని బాధ్యతగా పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు .కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వారు సూచించారు. అనాలోచితంతో చెట్లు నరికి వేయొద్దని ప్రజలకు తెలియజేశారు .కార్యక్రమంలో సంగమేశ్వర ఆలయ జీర్ణోద్దరణ కమిటీ సభ్యుడు ప్రవీణ్ స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు