NCC క్యాడేట్లకు ఆరోగ్యంపై అవగాహన
NCC క్యాడేట్లకు ఆరోగ్యంపై అవగాహన
కూడేరు (అక్టోబర్ 12) AP 39 TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని NCC నగర్లో 6 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి గురువారం క్యాడెట్లకు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం.. పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలపై క్యాడేట్లకు MLHP M. జయ అవగాహన కల్పించారు.. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు లేదంటే రోగాల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం పెంపొందుతుందని ఆమె వివరించారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ఆమె తెలియజేశారు . కార్యక్రమంలో NCC అధికారులు, కర్నూలు అనంతపురం జిల్లాలకు చెందిన క్యాడేట్లు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు