NCC నగర్ ను సందర్శించిన కర్నూల్ గ్రూప్ కమాండర్
NCC నగర్ ను సందర్శించిన కర్నూల్ గ్రూప్ కమాండర్
AP 39 TV న్యూస్, కూడేరు:
కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న NCC నగర్ లో 6 ఆంధ్ర బెటాలియన్ సిఏటిసి-3 శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. మంగళవారం కర్నూలుకు చెందిన గ్రూప్ కమాండర్ కల్నల్ రమేష్ సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన ఫైరింగ్, మ్యాప్ రీడింగ్ పై క్యాడెట్లకు ఇస్తున్న శిక్షణను తనిఖీ చేశారు. క్యారెట్ లకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు . క్యాడెట్లకు ఏర్పాటు చేసిన వసతిని తనిఖీ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాడెట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు . NCC లో శిక్షణ పొందడం బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నట్టేనని అన్నారు. ఏ బి సి సర్టిఫికెట్లతో ఉన్నత విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ సదుపాయం ఉంటుందన్నారు. కాబట్టి క్యాడెట్లు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో క్యాంప్ కమాండర్ కల్నల్ ముంద్రా, సుబేదార్ మేజర్ సుఖదేవ్ సింగ్, ncc అధికారులు రాకేష్ అనంతపురం కర్నూల్ నంద్యాల సత్యసాయి జిల్లాలకు చెందిన 350 మంది క్యాడేట్లు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు