పేదల సొంతింటి కలను నెరవేర్చండి -జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి
పేదల సొంతింటి కలను నెరవేర్చండి
-జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి
AP 39 TV న్యూస్ కూడేరు:
పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్ళ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయించి పేదల సొంతింటి కలలు నెరవేర్చాలని ఉరవకొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారి ,జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి మండల అధికారులకు సూచించారు. శనివారం ఆయన కూడేరు లోని జగనన్న లే అవుట్ లో పర్యటించారు .ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్లను తొందరగా నిర్మించుకోవాలని ..నిర్మాణ దశను బట్టి బిల్లులు మంజూరు చేస్తారని తెలియజేశారు. అనంతరం ఆయన మండలంలో ఎన్ని ఇల్లు మంజూరు అయ్యాయని, వాటిలో ఎన్ని ఇల్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఎన్ని ఇల్లు ఉన్నాయని హౌసింగ్ ఏఈతో ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎంకే భాషా హౌసింగ్ ఏఈ శేఖర్ ఏపీవో తులసి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రఘు, విఆర్వో ఓబులేష్ ,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
రిపోర్టర్: పవన్ కుమార్
కూడేరు