పీఏబీఆర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి
పీఏబీఆర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి
-ఎంపీపీ నారాయణరెడ్డి
AP 39 TV న్యూస్, కూడేరు:
జిల్లా కలెక్టర్ గౌతమి మంగళవారం కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం సందర్శించారు .ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సత్యసాయి ,శ్రీ రామ్ రెడ్డి ,ఉరవకొండ ,కూడేరు తాగునీటి ప్రాజెక్టులను పరిశీలించారు .ఈ సందర్భంగా ఎంపీపీ నారాయణరెడ్డి కలెక్టర్ ను కలిశారు .డ్యాంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. అదేవిధంగా ధర్మవరం కుడి కాలువకు సంబంధించిన గేట్లు దెబ్బతిన్నాయని మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరారు. కూడేరు తాగునీటి ప్రాజెక్టుకు ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేయించి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు.