కార్యకర్తల అండగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం
కార్యకర్తల అండగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం
శ్రీ సత్య సాయి జిల్లా ఓడిసి మండలం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. తొలుత మహమ్మదాబాద్ క్రాస్ లోని తెలుగుదేశం పార్టీ నాయకుడు చెరువు రవీందర్ రెడ్డి తల్లి ప్రభావతమ్మ వైకుంఠ సమారాధనకు హాజరై వారిని పరామర్శించారు, గౌరాపురంలో ఇటీవల 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరేష్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు, అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరప్పను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు, వేమారెడ్డి పల్లిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటిలో ఉన్న అశోక్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు, ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అలకుంట్ల రాజు
AP 39 TV
శ్రీ సత్య సాయి జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్