సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు పంపిణీ

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు పంపిణీ 

AP 39 TV న్యూస్ కూడేరు :

ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద డ్వామా ద్వారా వాటర్ షెడ్ కింద కూడేరు మండల పరిధిలోని చోళసముద్రం ,ముద్దలాపురం గ్రామాలకు సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు మంజూరయ్యాయి. అధికారులు సోమవారం వాటిని రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ వై ప్రణయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోళసముద్రం గ్రామానికి ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు .కొర్రకోడు నుంచి చోళసముద్రం మీదుగా పి నారాయణపురానికి సుమారు రూ.5.5 కోట్లతో తారు రోడ్డు వేయించడం జరిగిందన్నారు. చోళసముద్రం గ్రామం మీదుగా ఇప్పెరు చెరువుకు నీటిని విడుదల చేసేందుకు గాను కాలువ తవ్వకానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక తీర్మానం చేయించి నష్టపోయిన రైతులకు సుమారు రూ.2 కోట్ల వరకు పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు .ఇప్పుడు వాటర్ షెడ్ కింద ఈ గ్రామ అభివృద్ధికి సుమారు రూ.రెండు కోట్లు మంజూరయ్యాయన్నారు. అందులో 80 శాతం సబ్సిడీతో సుమారు రూ.19 లక్షల విలువ చేసే స్ప్రేయర్లు , స్పింక్లర్లు, టార్ఫాలిన్లు,పివిసి పైపులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ముద్దలాపురానికి రూ. 17 లక్షల విలువచేసే వ్యవసాయ పనిముట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు .వీటన్నిటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలు సాగు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు .కార్యక్రమలో ఎంపీపీ నారాయణరెడ్డి , వైస్ ఎంపీపీలు దేవా ,సుబ్బమ్మ , వాటర్ షెడ్ చైర్మన్లు పెన్నోబులేసు, పరందామ, సర్పంచులు ధనుంజయ, ఓబులమ్మ ,చంద్రశేఖర్ యాదవ్ ,రామాంజనేయులు , ఎంపీటీసీ సభ్యుడు శివలాల్, రెడ్డి , నాగభూషణం ,మండల అగ్రి అడ్వైజరీ చైర్మన్ నిర్మలమ్మ, మండల మహిళా విజేత సమాఖ్య అధ్యక్షురాలు గంగమ్మ , మండల కో ఆప్షన్ సభ్యుడు సర్దార్ వలి ,వైఎస్సార్ సీపీ నేతలు బైరెడ్డి రామచంద్రారెడ్డి, లోకనాథ్ స్వామి ,గంగాధర్ , ఎర్రిస్వామి , రామాంజనేయులు, దేవేంద్ర, వడ్డే గంగాధర్, డ్వామా టిఓ విశ్వనాథరెడ్డి , జేఈ ఓబుళపతి ,ఆగ్రోస్ ప్రతినిధి శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.