పనులు కల్పించి .. వలసలు అరికట్టండి
-వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవ రెడ్డి
కూడేరు,(అక్టోబర్ 25)AP 39 TV న్యూస్:-
ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పించి కూలీలు వలసలు వెళ్లకుండా అరికట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. ప్రతి కూలికి 200 రోజులు పని దినాలు కల్పించాలని దిన కూలి రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కూడేరు,తిమ్మాపురం , నారాయణపురం చోలసముద్రము, కమ్మూరు ఇప్పేరులోని సచివాలయంలో అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఉరవకొండ తాలూకా కార్యదర్శి జే మల్లికార్జున వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెరుగుసంఘప్ప వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు రమణ. తాలూకా అధ్యక్షులు మలరాయుడు. మండల నాయకులు కాసిం పీరా వెంకటేష్. కమ్మూరు కాసిం తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు